ADB: పోలింగ్ కేంద్రానికి చీరలతో కాంపౌండ్ వాల్‌ను ఏర్పాటు చేసిన దృశ్యం ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. 2వ విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బూర్నూర్ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శి చీరలను పాఠశాలకు రెండు వైపుల కట్టించి తాత్కాలికంగా కాంపౌండ్ వాల్‌ను ఏర్పాటు చేశారు.