EG: జగ్గంపేట కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన ఎరువులు గోడౌన్ను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు యూరియా కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా కోపరేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ గోడౌన్లు నిర్మించడం జరిగిందన్నారు.