పార్వతీపురం మన్యం జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు ఇవాళ మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ తదితరుల పాల్గొన్నారు.