ATP: గార్లదిన్నెలోని మిడ్ పెన్నార్ డ్యామ్ అధికారులకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రోప్, గేటు సామగ్రిని అందజేశారు. 3 రోజుల నుంచి నార్త్ కెనాల్ గేటు ద్వారా నీటి ప్రవాహాన్ని పెంచేందుకు అధికారులు పరిశీలించగా రోప్ తెగిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కర్ణాటక నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించి కెనాల్ గేటు మరమ్మతు పనులు పూర్తి చేయించారు.