H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వస్తోంది. తాజాగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోని 20 రాష్ట్రాలు దావా వేశాయి. ట్రంప్ నిర్ణయించిన రుసుమును నిలిపివేయాలని కోరాయి. H-1B వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌నకు లేదని, ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని తెలిపాయి.