RR: హయత్ నగర్ డివిజన్లోని ఖాదీ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీసీ రోడ్ల నిర్మాణం, మంచినీటి పైపులైన్ ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ, తదితర సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. పటిష్టమైన ప్రణాళికతో వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.