ADB: తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నయా జోష్ కనిపిస్తుంది. తొలివిడతల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో కూడా అదే ఉత్సాహంతోనే తమ అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా క్షేత్రస్తాయిలో నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారు. కాగా ఈనెల 14న రెండో విడత ఎలక్షన్లు జరగనున్నాయి.