ASR: కొయ్యూరు మండలం కితలోవ గ్రామానికి వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ శుక్రవారం హిట్ టీవీ న్యూస్లో వచ్చిన వార్తకు స్పందన లభించింది. పంచాయతీ అభివృద్ధి అధికారి సత్యనారాయణ ఆ శాఖ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లారు. దీంతో ఆ శాఖ ఏఈ శనివారం గ్రామానికి వెళ్లి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.