ASF: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి, బెజ్జార్, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్ పేట్, సిర్పూర్ (T) మండలాల్లోని 113 GPలకు ఈనెల 14న పోలింగ్ జరగనుంది. మొత్తం 438 మంది సర్పంచ్ అభ్యర్ధులు, 2,209 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 6 జీపీల్లో ఒక సర్పంచ్ స్థానంతో పాటు 143 వార్డులు, ఏకగ్రీవమయ్యాయి.