NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని జాంబీ హనుమాన్ మందిరంలో శనివారం రోజు భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. సర్పంచ్ అభ్యర్థులు మొండి రవి, మొండి అశోక్, వారి కుటుంబ సమేతంగా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. జాంబి హనుమాన్ యూత్ వారు, మొండి రవి, అశోక్, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.