MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లను మెదక్ ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. 16 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.