ASR: కొయ్యూరు మండలం చుట్టుబందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన పొట్టిక నూకాలమ్మ అనే గిరిజన మహిళకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు. గృహోపకరణాలు, తిండి గింజలు, బట్టలు, రూ.10వేలు, కొంత బంగారం, సామాగ్రి కాలి బూడిదయ్యాయని బాధితురాలు ఆవేదన చెందారు.