NLG: చిట్యాల మండలం చిన్నకాపర్తిలో డ్రైనేజీ కాలువలో బ్యాలెట్ పేపర్లు బయటపడిన ఘటనతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికారులు పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా పని చేశారని ఆరోపించారు. ఎన్నికను రద్దుచేసి తిరిగి పోలింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.