కృష్ణా: హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడకు వచ్చే ప్రధాన మార్గంలో నాగవర్పాడు బ్రిడ్జి ప్రాంతం నగరానికి స్వాగత ద్వారంలాంటిది. అలాంటి ముఖద్వారం వద్ద ప్రస్తుతం ఓ అనధికార విగ్రహ దిమ్మ ఏర్పాటు అయి ఉండటం ఆందోళన కలిగిస్తుందని భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు మురళీకృష్ణ శనివారం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న అధికారులను వాటిని పట్టించుకోవడం లేదన్నారు.