కృష్ణా: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజీమార్గమే రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. గోపి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు.