KMR: గాంధారిలోని పోతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మిట్టపల్లి భవ్యశ్రీ, అండర్-17 సెపక్ తక్రా క్రీడా పోటీలకు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పీడీ నాగరాజు తెలిపారు. ఈ పోటీలు DEC 16 నుంచి 22 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగనున్నాయి. తెలంగాణ సెపక్ తక్రా జట్టు కెప్టెన్‌గా భవ్యశ్రీ ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు