MLG: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు జాతర చుట్టూ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సహచర మంత్రి సీతక్కతో కలిసి మేడారం జాతర పనులను పరిశీలించారు. గద్దెల విస్తరణ, ప్రాకారం నిర్మాణం, ఇతర అన్ని పనులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయన్నారు.