NRML: ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. శుక్రవారం విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు. వాతావరణ హెచ్చరికల మేరకు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, సహాయక దళాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.