వరంగల్ కలెక్టరేట్లో కోతుల హాజరు చర్చనీయాంశంగా మారింది. ఉదయం కార్యాలయాలు తెరవకముందే కోతులు భవనాల్లోకి వచ్చి తిరుగుతుండటంతో ఉద్యోగులు, సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫైళ్లు, వస్తువులు చెల్లాచెదురుగా పడేయడంతో పాటు భయాందోళనకు గురి చేస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. కోతుల బెడద నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.