WGL: నెక్కొండ మండలంలోని ముదిగొండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు.