AP: CRDA త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘జరీబు భూములు సమస్యపై నెలరోజుల సమయం అడిగాం. మట్టి నమూనా పరీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటాం. గ్రామ కంఠాల విషయంలో వెరిఫై చేసి నిర్ణయం తీసుకుంటాం. ల్యాండ్ పూలింగ్ ఇంకా 2,400 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. రైతులతో మరోసారి చర్చిస్తాం’ అని పేర్కొన్నారు.