KMM: మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 192 సర్పంచ్ స్థానాలకుగాను 136 స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. రఘునాథపాలెం మండలంలో 37 పంచాయతీలో ఉండగా కాంగ్రెస్ 25 పంచాయతీలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 11 స్థానాలు, సీపీఐ 1 స్థానం గెలుచుకుంది.