MLG: పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించారు.