NZB: మోస్రా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సర్పంచ్‌గా విజయం సాధించిన గుత్పె భూపాల్ రెడ్డి గత జడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 130 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం 1,213 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని మోస్రా సర్పంచ్ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు.