SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామంలో ఇవాళ ఉదయం సముద్రంలోకి వేటకి వెళ్ళిన కొమర రాజయ్య (60) మృతి చెందారు. తన తోటి మత్స్యకారులతో యధావిధిగా వేటకు వెళ్లిన సమయంలో అలలు ఉధృతికి మృతి చెందారని తోటి మత్యకారులు తెలిపారు. స్థానికులు మత్స్యశాఖ, రెవిన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.