విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అక్కయ్యపాలెంలోని స్టేడియం లీజును రద్దు చేసింది. లీజు నిబంధనల ఉల్లంఘన, అనుమతుల్లేక కార్యక్రమాలు, సబ్లీజులు ఇచ్చిన అంశాలపై కోర్టు పోర్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఖాళీ చేయాలని విశ్వనాథ్ ఎవెన్యూస్కు నోటీసులు జారీచేసింది.