SKLM: లావేరు మండలం బెజ్జిపురంలో ఒక స్క్రబ్ టైపస్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన వృద్ధుడు వ్యవసాయ పనులు చేస్తుండగా పేడ పురుగు కుట్టడంతో పది రోజులుగా జ్వరం రావడంతో వైద్యులను సంప్రదించగా, పరీక్షల్లో టైపస్గా నిర్ధారణైంది. చికిత్సతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.