ELR: చింతలపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇవాళ నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షను డీఈవో వెంకటలక్ష్మమ్మ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని వసతులు, విద్యార్థుల హాజరును ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నవోదయలో ప్రవేశం కోసం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పరీక్షకు హాజరయ్యారు.