VZM: చీపురుపల్లిలో శనివారం ఉదయం డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ శంకర్రావు యువత మత్తు పదార్థాలు, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.