VZM: తెర్లాం మండలం చినగొలుగువలస అగ్నిప్రమాద బాధితులను ఇవాళ బుడా ఛైర్మన్ తెంటు రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఆయనతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.