W.G: తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ ఉపకులపతిగా డాక్టర్ కె. ధనుంజయరావు నియమితులయ్యారు. నిన్న సాయంత్రం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ వీసీగా ఉన్న కే.గోపాల్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ధనుంజయ రావును ప్రభుత్వం నియమించింది.