RR: పాటిగడ్డ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామ నూతన సర్పంచ్ శ్యామల అఖిల్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. గ్రామ వంతెన నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాజకీయాల్లో యువత ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు.