TG: CM రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజన్ 2047 అంటూ రేవంత్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది విజన్ 2047 కాదని.. పాయిజన్ 2047 అని విమర్శించారు. రేవంత్ నోరు విప్పితే అబద్ధాలేనని మండిపడ్డారు. 90 మంది పిల్లలు ఆస్పత్రిపాలైతే.. ఇప్పటివరకు మంత్రులెవరు పరామర్శించలేదని ధ్వజమెత్తారు.