గుంటూరులో ఇంగ్లీష్ టీచర్ కార్తీక్(45)పై 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలతో కేసు నమోదైంది. గుజ్జనగుండ్లకు చెందిన నిందితుడు బాలికను మాయమాటలతో తన ఇంటికి తీసుకెళ్లి దాడి చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదుతో మేడికొండూరు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.