పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండల సమాఖ్య కార్యాలయాలకు ఒక కంప్యూటర్, ప్రింటర్‌ను ప్రభుత్వం అందించిందని డీఆర్డీఏ పీడీ సుధారాణి తెలిపారు. శుక్రవారం ఈ కంప్యూటర్లను మండల ఏపీఎంలకు అందజేశామన్నారు. ఇటీవల పెరిగిన ఆన్లైన్ పనులకు సిబ్బంది సౌకర్యార్థం సెర్ప్ సీఈవో అందజేశారన్నారు. ఉద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం సూచించిన పనులు చేయాలని కోరారు.