జూ.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. లాంగ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ HYDలోని రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ ప్రారంభమైంది. ఇందులో తారక్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు మూడు నెలలపాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 జూన్ 25న విడుదలవుతుంది.