కృష్ణా: ఉర్సు పండుగకు వెళ్లే భక్తుల ప్రయాణం సులభం చేసేందుకు మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు నడపనుంది. రైలు 23న అజ్మీర్ చేరుతుంది. తిరుగు రైలు డిసెంబర్ 28న ఉదయం 8.25 కు బయలుదేరి 30న మచిలీపట్నం చేరుతుంది. షెడ్యూల్ను ఎంపీ బాలశౌరి తెలిపారు.