MHBD: కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క ఇవాళ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలానికి వచ్చిన మంత్రి గుంజేడు ముసలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నట్లు సీతక్క తెలిపారు.