భారీ పరిమాణంలో చమురును తీసుకెళ్తోన్న ఒక నౌకను ఇరాన్ సీజ్ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆ ట్యాంకర్‌లోని సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నౌకలో మొత్తం 18మంది సిబ్బంది ఉండగా.. వారిలో శ్రీలంక, బంగ్లాదేశ్ వాసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి.