పార్వతీపురం జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, బీపీసీలకు కూటమి 5జీ మొబైల్స్ అందించనుంది. ఈ సెల్ ఫోన్స్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇవాళ అందజేయనున్నారు. జిల్లాలో 2,075 మంది అంగన్వాడీలు, 84 మంది సూపర్వైజర్లు, పది మంది బీపీసీలు ఉన్నారు. విధుల్లోని ఆన్లైన్ పనులకు ఆటంకం కలగకుండా ఈ కొత్త ఫోన్లను అందజేస్తున్నారు.