అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సి కోల్కతాకు చేరుకున్నాడు. 2011 తర్వాత ఈ స్టార్ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. కోల్కతా టూర్లో భాగంగా లేక్టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించనున్నారు. అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, షారుఖ్ ఖాన్, బెంగాల్ CM మమతలను కలుస్తారు. సాయంత్రం HYDకి చేరుకోనున్నారు.