మెరుగై ఆరోగ్యం కోసం కంటికి సరిపడా నిద్ర ఎంతో అవసరం. అయితే చాలామంది ఉద్యోగ అవసరాలు, వినోదం, ఇతర పనుల్లో పడి సరిగా నిద్రపోవట్లేదు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని, ఫలితంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్స్‌లో కనీసం ఓ 2 గంటలు అదనంగా పడుకోవాలని, అప్పుడప్పుడు లేటుగా లేవడం మంచిదేనని సూచిస్తున్నారు.