కృష్ణా: ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇటీవల జిల్లాకు విద్యాశాఖ అధికారిగా నియమితులైన సుబ్బారావును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నూతన డీఈవో సుబ్బారావుని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.