ELR: జంగారెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నవోదయం 2.0 కార్యక్రమం చేపట్టారు. నవోదయం 2.0 లో భాగంగా ‘మార్పు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నాటుసారాయి వృత్తిని వీడి, సమాజంలో నిలదొక్కుకోవాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న ‘మార్పు’ కార్యక్రమం గొప్ప సహాయాన్ని అందిస్తుందని అధికారులు వివరించారు.