SKLM: ఆమదాలవలస లక్ష్మీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన రూ. 6 లక్షల విలువైన ఆర్వో ప్లాంట్ గత కొన్ని రోజులుగా పని చేయడం లేదు. దీంతో విద్యార్థులు తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో 400 పైగా మంది విద్యార్థులు చదువు కుంటుండగా, వారికి శుభ్రమైన తాగునీరు అందించే ఏకైక వనరు ఇదే. మరమ్మతులు జరిగేలా చర్యలు చేపడతామని ఉపాధ్యాయులు తెలిపారు.