NZB: బోధన్ మండలం లంగ్డాపూర్లో అత్త బెల్లిడీగ గంగామణిపై కోడలు బెల్లిడీగ శోభారాణి ఘన విజయం సాధించింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగగా శోభారాణి 232 ఓట్ల తేడాతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 424 ఓట్లు ఉండగా గంగామణికి 93 ఓట్లు, శోభారాణికి 325 ఓట్లు పోలయ్యాయి. తన విజయానికి సహకరించిన గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది