KMR: రాజంపేట మండలం నడిమి తండా ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడింది. కేవలం ఒక్క ఓటు తేడాతో బానోత్ లక్ష్మీ సర్పంచిగా విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన లక్ష్మికి 290 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి సునీతకు 289 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు చివరివరకు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. చివరికి ఒకే ఓటు మెజారిటీతో లక్ష్మీ గెలుపొందింది.