BDK: కరకగూడెం, పినపాక మండలంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. మండల చరిత్రలో స్వతంత్ర అభ్యర్థి గెలవడం తొలిసారి కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కల్తీ విజయ్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి భాస్కర్ నాయక్‌పై 90 ఓట్ల తేడాతో గెలుపొందారు.