ATP: మస్కట్ దేశంలో చిత్రహింసలకు గురై బాధపడుతున్న మహిళను కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ మేరకు గురువారం గుంతకల్లు ఈద్గా ఫంక్షన్ హాల్లో టీడీపీ మైనారిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాదిత మహిళా జుబేదా మాట్లాడుతూ.. మస్కట్లో ఇబ్బంది పడుతున్న తనను గుంతకల్లుకు తీసుకొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.