KRNL: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు నగర శివారులోని అనంతపురం రోడ్డులో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన భవన కార్యాలయాన్ని ఉదయం 11.50 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఆయన పర్యటన వివరాలను వెల్లడించాయి.